ఆప్యాయమైన మాటలతో ఒక కార్డు రాసి, ఇంట్లో తయారుచేసిన ఒక తినుబండారాన్ని అందించడం ద్వారా ఇతరులతో ప్రేమను, శాంతిని పంచుకోవడం ఎంత సులభమో నేను గ్రహించాను. మేము ఈ చిన్న బహుమతిని మా అపార్ట్‌మెంట్ మేనేజర్‌తో పంచుకున్నాము, అది సరైన సమయంలో ఇచ్చామని ఆమె అన్నారు. ప్రచార వచనాలు ఉన్న ఆ చిన్న కార్డును తన డెస్క్‌పై ప్రదర్శించుకోవడానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు! ఈ సంవత్సరం, చిన్న చిన్న పనుల ద్వారా నా చుట్టూ ఉన్న వారికి శాంతిని పంచడానికి నేను మరిన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను!
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
27