‘어머니 사랑과 평화의 날’ & UN ‘국제 관용의 날’ 기념 캠페인

ఈ లోకంలో జన్మించినప్పుడు తల్లి ప్రేమను మొదటిసారిగా పొందుతాము.
పిల్లలకు ఆమె యొక్క అంతులేని మద్దతు, శ్రద్ధవహింపు, త్యాగం మరియు పిల్లలకు సేవ చేయుట
దేశాలకు ఆతీతంగా మానవత్వంతో ప్రతిధ్వనించే సద్గుణ విలువలు, జాతులు మరియు సంస్కృతులు

2024లో 60వ వార్షికోత్సవ సందర్భంగా, దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ నవంబర్ 1ని “తల్లి యొక్క ప్రేమ మరియు శాంతి దినం” అని ప్రకటించారు.
ప్రతి నవంబర్లో, సంఘము దైనందిన జీవితంలో తల్లి యొక్క ప్రేమను అభ్యసించడం ద్వారా సంభాషణ మరియు సామరస్యంతో ప్రపంచ ప్రచారాన్ని నిర్వహిస్తున్నది.

ఈ ప్రచారం UNతో సమీకరించి
ఓర్పు కొరకు అంతర్జాతీయ దినము.
సంఘర్షణ, హింస మరియు యుద్ధంతో నిండిన యుగంలో,
తల్లి ప్రేమ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది
స్థిరమైన శాంతిని తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము.


‘తల్లి యొక్క ప్రేమ మాటలు’ ద్వారా పంచుకున్న శాంతి కథనాన్ని వీడియోలో చూడండి.

1:24
#01 భోజన సమయం
1:16
#02 ఎలివేటర్
1:29
#03 కార్యాలయం

సంవత్సరం యొక్క ఉద్దేశ్యం
శాంతికి నాంది: తల్లి యొక్క ప్రేమ మాటలు.

“తల్లి యొక్క ప్రేమ మాటలు” ద్వారా
అర్థం చేసుకోవటం మరియు శ్రద్ధవహింపుతో కూడిన వెచ్చనైన పదాలతో సంభాషించడం.
తల్లి ప్రేమ ఎక్కడ చేరుతుందో అక్కడ శాంతి స్థిరపడుతుంది.

01.“ఎలా ఉన్నారు?”

శాంతికి మొదటి మాట

ఎలివేటర్లో మీరు కలిసే ఇరుగుపొరుగు వారు, హాలులో మిమ్మును దాటిపోవు స్నేహితుడు, పొరుగువారిని జాగ్రత్తగా చూసుకునే మరియు రక్షించే కృతజ్ఞత గల వ్యక్తులు…
ప్రతిరోజూ మీరు చూసే లేదా దాటిన వారిని హృదయపూర్వకంగా పలకరించండి.

02.“ధన్యవాదములు. అంతయూ మీకు ధన్యవాదములు. మీరు కష్టపడి పని చేశారు.”

చిన్న చిన్న ప్రయత్నాలు మరియు దయతో కూడిన క్రియలకు కూడా కృతజ్ఞతలు తెలియజేయండి.

మీ కొరకు వెచ్చని భోజనాన్ని సిద్ధం చేసిన చేతులకు మరియు మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేర్చినందుకు డ్రైవర్కి కృతజ్ఞతలు తెలియజేయండి.
వెచ్చని హృదయాలు వస్తూ పోతూవుంటూ, మీ దైనందిన జీవితంలో సంతోషం వికసిస్తుంది.

03.“నన్ను క్షమించండి. అది మీకు కష్టమై ఉండవచ్చు.”

ఎదుటివారి భావాలను ముందుగా అర్థం చేసుకోవడం ద్వారా హృదయాన్ని కదిలించే మాట

మీకు ఎవరితోనైనా శాంతియుత సంబంధం అవసరమా?
మీ మాటలు మరియు చర్యలు అవతలి వ్యక్తి దృష్టికోణంలో ప్రతిభింబించడం ఎలా?
మీ తప్పులకు క్షమాపణలు చెప్పండి మరియు ముందుగా మీ చేతిని చాపండి. శాంతి వినయమైన హృదయం నుండి వచ్చును.

04.“పర్వాలేదు. నేను అర్థం చేసుకోగలను.”

లోపాలను హత్తుకునే క్షమాపణ యొక్క మాట

ఎవరైనా తప్పులు చేయవచ్చు.
విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్న వారిని దయతో స్వీకరించండి.

05.“దయచేసి, మీ తరువాత.”

అసహనానికి గురైనప్పుడు, శ్వాస తీసుకోండి మరియు ఇతరులకు అవకాశం ఇవ్వండి

సబ్ వే టర్న్ స్టైల్ వద్ద, సూపర్ మార్కెట్ చెక్ అవుట్ వద్ద లేదా చక్రాల వెనుక... బిజీగా ఉన్న పరిస్థితులలో ముందుగా తగ్గుటకు ప్రయత్నించండి.
ఒక్క క్షణం ఓర్పు మీ రోజుకు శాంతిని తెస్తుంది.

06.“నేను మీ ఆలోచనల గురించి మరింత వినాలనుకుంటున్నాను.”

అభిప్రాయాలు భిన్నమైనప్పుడు, ఇతరుల మాట మరింత శ్రద్ధగా వినండి.

ఏ పరిస్థితిలోనైనా అభిప్రాయాలు భిన్నమైనప్పుడు మరియు ప్రతి వ్యక్తి తమ స్వంత అభిప్రాయాలు కలిగియున్నప్పుడు, దయచేసి ఒక్క క్షణం ఆగి వినండి. ఇతరుల పట్ల గౌరవం మరియు శ్రద్ధ వహింపు సంభాషణ ప్రభావవంతం కావడానికి కీలకమైనవి.

07.“నేను మీ కోసం ప్రార్థిస్తాను (ఉత్సాహించండి). అంతా మంచిగా జరుగుతుంది.”

హృదయపూర్వక మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించండి

ఉత్సాహపరిచే వ్యక్తులు ఉన్నారని తెలుసుకోవడం ఏ పరిస్థితులోనైనా నాకు బలాన్ని ఇస్తుంది. దయచేసి కష్టతరమైన పరిస్థితులలో ఉన్నవారికి హృదయపూర్వక మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించండి.

ఈ రోజు, ‘తల్లి యొక్క ప్రేమ మాటలు’ ద్వారా శాంతిని సాధించండి.
క్యాంపెయిన్లో పాల్గొనుట